te_tn/act/10/01.md

1.5 KiB

ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి

కథలో కొత్త వ్యక్తిని పరిచయం చెయ్యడానికిది ఒక పద్ధతి. ఈ సందర్భంలో ఇతడు కొర్నేలి.

కైసరయ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉండేవాడు. ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి

"అతని పేరు కొర్నేలి, రోమా సైన్యంలోని ఇటలీ దళం నుండి 100 మంది సైనికులకు ఇతడు అధికారి."

అతడు దేవుణ్ణి ఆరాధించేవాడు

"అతడు దేవునిపై విశ్వాసముంచాడు, తన జీవితంలో దేవుని ఘనపరచాలనీ, ఆరాధించాలని భావించాడు."

అతడు కుటుంబ సమేతంగా "తన ఇంటిలోని కుటుంబ సభ్యులందరితో." (చూడండి: అన్యాపదేశం)

దానధర్మాలు చేస్తూ

"పేదవారికి." దేవుని పట్ల తన భయభక్తులను కనపరచడానికి ఇది ఒక మార్గం.