te_tn/luk/11/14.md

2.5 KiB

ఆయన ఒక మూగ దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు

"యేసు, ఒకాయన లోనుండి దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు" లేదా "ఒకాయన లోనుండి ఆయన దయ్యాన్ని బయటికి పంపించేస్తున్నాడు."

అది మూగది

దయ్యం మాట్లాడదని కాదు, దీని అర్ధం. ప్రజల్ని మాట్లాడకుండా ఆపే శక్తి ఈ దయ్యానికి ఉందని చదివే వాళ్ళు అర్ధం చేసుకుని ఉంటారు. నీవు ఈ అస్పష్టమైన విషయాన్ని ఇలా స్పష్టంగా చెప్పవచ్చు,"దయ్యం అతన్ని మాట్లాడలేకుండా చేసింది." (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన. Explicit and Implicit)

అయితే ఇలా జరిగింది

పని కొత్త గా మొదలయిందనే సూచనగా ఈ మాట వాడతారు. మీ భాషలో యిలా వాడే విధానం ఏదైనా ఉంటే, దానిని యిక్కడ వాడవచ్చు. దయ్యం అతనిలో నుండి వచ్చిన తర్వాత, కొంతమంది యేసును విమర్శించారు. దానిని బట్టి యేసు దురాత్మలను గురించ్జి బోధిస్తున్నాడు.

ఆ దయ్యం వడలిపోయిన తర్వాత

"అతనిలో నుండి దయ్యం బయటికి వెళ్ళిపోయిన తర్వాత" లేదా "దయ్యం అతనిని వదిలిన తర్వాత"

మూగవాడు మాట్లాడాడు

"మాట్లాడలేని వాడు మాట్లాడాడు"

బయల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు

" దయ్యాల అధిపతి, బయల్జెబూలు శక్తితో ఆయన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు"