దయ్యం మాట్లాడదని కాదు, దీని అర్ధం. ప్రజల్ని మాట్లాడకుండా ఆపే శక్తి ఈ దయ్యానికి ఉందని చదివే వాళ్ళు అర్ధం చేసుకుని ఉంటారు. నీవు ఈ అస్పష్టమైన విషయాన్ని ఇలా స్పష్టంగా చెప్పవచ్చు,"దయ్యం అతన్ని మాట్లాడలేకుండా చేసింది." (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన. Explicit and Implicit)
పని కొత్త గా మొదలయిందనే సూచనగా ఈ మాట వాడతారు. మీ భాషలో యిలా వాడే విధానం ఏదైనా ఉంటే, దానిని యిక్కడ వాడవచ్చు. దయ్యం అతనిలో నుండి వచ్చిన తర్వాత, కొంతమంది యేసును విమర్శించారు. దానిని బట్టి యేసు దురాత్మలను గురించ్జి బోధిస్తున్నాడు.