te_tn/luk/06/39.md

2.8 KiB

(యేసు ప్రజలకు బోధించడం కొనసాగిస్తూ ఉన్నాడు కానీ తీర్పు తీర్చడం లేదు.)

ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తాడా?

ప్రజలకు అంతకు ముందే తెలిసిన దానిని గురించి వారు ఆలోచించేలా యేసు ఈ అలంకారిక ప్రశ్న. Rhetorical Question వాడాడు. దీనిని ఇలా అనువదించవచ్చు," ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపించలేడు గదా!" లేదా " ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపించలేడనేది మనందరికీ తెలుసు గదా!"(చూడండి: అలంకారిక ప్రశ్న. Rhetorical Question)

అలా చేస్తే

కొన్ని భాషల్లో "ఒకడు అలా చేస్తే" అంటారు.

వారిద్దరూ గుంటలో పడరా?

ఇది మరొకఅలంకారిక ప్రశ్న. Rhetorical Question. దీనిని ఇలా అనువదించవచ్చు," వారిద్దరూ గుంటలో పడతారు గదా!" లేదా "వారిద్దరూ గుంటలో పడతారు" (యూ డీ బీ).

శిష్యుడు తన గురువు కంటె గొప్పవాడు కాడు

దీనికి ఈ రెంటిలో ఏదో ఒక అర్ధం రావొచ్చు. 1) శిష్యునికి తన గురువు కంటే ఎక్కువ జ్ఞానం ఉండదు" లేదా 2) శిష్యునికి తన గురువు కంటే ఎక్కువ అధికారం ఉండదు." దీనిని ఇలా అనువదించవచ్చు, " శిష్యుడు తన గురువును మించిపోడు."

సంపూర్ణంగా సిద్ధపడినవాడు

"బాగా శిక్షణ పొందిన శిష్యుడు." క్రియాశీల పదం తో దీనిని ఇలా అనువదించవచ్చు,"తన శిక్షణా గమ్యాల్ని చేరుకున్న ప్రతి శిష్యుడూ" లేదా 'గురువు పూర్తిగా నేర్పిన ప్రతి శిష్యుడూ" (చూడండి: క్రియాశీల నిష్క్రియాత్మక. Active passive)