ప్రజలకు అంతకు ముందే తెలిసిన దానిని గురించి వారు ఆలోచించేలా యేసు ఈ అలంకారిక ప్రశ్న. Rhetorical Question వాడాడు. దీనిని ఇలా అనువదించవచ్చు," ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపించలేడు గదా!" లేదా " ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపించలేడనేది మనందరికీ తెలుసు గదా!"(చూడండి: అలంకారిక ప్రశ్న. Rhetorical Question)
దీనికి ఈ రెంటిలో ఏదో ఒక అర్ధం రావొచ్చు. 1) శిష్యునికి తన గురువు కంటే ఎక్కువ జ్ఞానం ఉండదు" లేదా 2) శిష్యునికి తన గురువు కంటే ఎక్కువ అధికారం ఉండదు." దీనిని ఇలా అనువదించవచ్చు, " శిష్యుడు తన గురువును మించిపోడు."
"బాగా శిక్షణ పొందిన శిష్యుడు." క్రియాశీల పదం తో దీనిని ఇలా అనువదించవచ్చు,"తన శిక్షణా గమ్యాల్ని చేరుకున్న ప్రతి శిష్యుడూ" లేదా 'గురువు పూర్తిగా నేర్పిన ప్రతి శిష్యుడూ" (చూడండి: క్రియాశీల నిష్క్రియాత్మక. Active passive)