te_tn/luk/01/30.md

2.0 KiB

నీకు దేవుని అనుగ్రహం లభించింది

దీనిని ఇలా అనువదించవచ్చు. "దేవుడు తన కృప నీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు." లేదా "దేవుడు నీపట్ల కృపతో ఉన్నాడు" లేదా దేవుడు తన దయ నీకు చూపిస్తున్నాడు."

ఆయన్ని సర్వోన్నతుని కుమారుడు అంటారు

దీనిని ఇలా అనువదించవచ్చు. "సర్వోన్నతుని కుమారుడు అని ప్రజలు ఆయన్ని పిలుస్తారు" లేదా "ఆయన సర్వోన్నతుని కుమారుడిగా ప్రజలు గుర్తిస్తారు."

ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు

దీనిని ఇలా అనువదించవచ్చు. "తన పూర్వికుడైన దావీదు లాగా రాజు వలె పరిపాలించే అధికారాన్ని ఆయన ఇస్తాడు." సింహాసనం అనేది పాలించే రాజు అధికారాన్ని సూచిస్తుంది. (చూడండి: అన్యపదేశ లక్షణము)

ఆయన తండ్రి

బైబిల్లో ఎక్కువగా వాడే "తండ్రులు" అనే పదం, పూర్వీకులకు సంబంధించినది. "కుమారులు" అనే పదం వారసులకు సంబంధించినది. "ఆయన" అనే పదం మరియ కొడుకుకు చెందినది.