2.8 KiB
కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం,
ప్రత్యామ్నాయ అనువాదం: “ఎవరైనా మనకి ఇబ్బందులు, హింసలు, కలిగించి, మన అన్న వస్త్రాలు లాగేసుకుని, చంపేసినా సరే.” (చూడండి: అన్యాపదేశం)
బాధలు, హింసలు
ఈ రెంటికీ అర్థం ఒకటే. (చూడండి ఏకమూలక పదాలు )
నీకోసం
ఇది ఏకవచనం. దేవుడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నీ నిమిత్తమే” (చూడండి: 'నీవు' రూపాలు)
మేము రోజంతా వధకు గురౌతున్నాం
ఇక్కడ మేము అనేది లేఖనాల్లో ఈ భాగం రాసిన వారు. అంతేకాదు దేవునికి నమ్మకంగా ఉన్నవారు. “రోజంతా అనే మాట తాను ఎంత ప్రమాదంలో ఉన్నానో పౌలు అతిశయోక్తిగా చెబుతున్నాడు. పౌలు ఈ లేఖనాల ద్వారా దేవునికి చెందిన వారు కష్టాలు కలుగుతాయని తెలిసి ఉండాలని చెబుతున్నాడు. దీన్ని క్రియా పదంతో కూడా అనువదించ వచ్చు: “మన శత్రువులు అస్తమానం మనల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు.” (చూడండి: కలుపుకొను, అతిశయోక్తి, కర్తరి కర్మణి వాక్యాలు)
వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు
దీని పోలిక ఎలా చెబుతున్నారంటే దేవునికి నమ్మకంగా ఉన్నందుకు తమను మనుషులు గొర్రెలను కోళ్ళను చంపినట్టు చంపుతున్నారు.” (చూడండి: రూపకం) క్రియాపదంతో ప్రత్యామ్నాయ అనువాదం : “వారు చంపే గొర్రెల ప్రాణం లాగా మా ప్రాణానికి కూడా విలువ లేకుండా పోయింది.” (చూడండి: రూపకం)