3.0 KiB
ఇదిలా ఉంటే
పౌలు తన ఉపోద్ఘాతాన్ని ముగిస్తూ, ఇప్పుడు తన ప్రధాన అంశాన్ని ప్రారంభిస్తున్నాడు.
ఇప్పడు
"ఇప్పుడు" అనే పదం యేసు ఈ లోకానికి వచ్చిన సమయాన్ని సూచిస్తుంది.
ధర్మశాస్త్రం లేకుండా దేవుని నీతి వెల్లడైంది
దీనిని కర్త ప్రధాన వాక్యంగా అనువదించవచ్చు: "ధర్మశాస్త్రానికి లోబడక పోయినా, నీతిమoతులుగా ఉoడడానికి దేవుడు ఒక మార్గాన్ని తెలియచేస్తున్నాడు" (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు).
ధర్మశాస్త్రం లేకుండా
"తెలియకుండా లేదు,"ఇది "నీతి" ని సూచిస్తుంది.
ధర్మశాస్త్రమూ, ప్రవక్తలూ రాసిన దానికి సాక్షంగా ఉన్నాయి
"ధర్మశాస్త్రమూ, ప్రవక్తలూ" అనే పదాలు లేఖన భాగాలను సూచిస్తున్నాయి. అవి యూదుల లేఖనాలు కోసం మోషే, ప్రవక్తలూ రాసినవి, వాటిని న్యాయ స్థానంలో సాక్ష్యమిచ్చే వ్యక్తులుగా వర్ణించడం జరిగింది. దీనిని కర్త ప్రధాన వాక్యంతో ప్రత్యామ్నాయ అనువాదం చేయవచ్చు: "మోషే, ప్రవక్తలు రాసింది రూఢీ చేయడం జరిగింది." (చూడండి: అన్యాపదేశం, వ్యక్తిత్వారోపణ).
అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికి కలిగే దేవుని నీతి
“యేసు క్రీస్తులో మనం నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనకిచ్చిన నీతి గురించి నేను ప్రస్తావిస్తున్నాను.”
భేదమేమీ లేదు
"దేవుడు యూదులను చూసిన రీతిగానే అదే విధానంలో యూదేతరులైన అన్యజనులనూ చూస్తాడు” (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన సమాచారం).