1.8 KiB
1.8 KiB
పౌలు ఒక ఊహాత్మకమైన యూదునితో తన వాదనను కొనసాగిస్తున్నాడు, అలాంటి వ్యక్తి ప్రశ్నలకు సమాధానమిస్తున్నాడు.
కొందరు యూదులకు విశ్వాసం లేకపోతే ఏమిటి? వారి అపనమ్మకాన్ని బట్టి దేవుణ్ణి నమ్మదగినవాడు కాకపోతాడా?
మనుషులు ఆలోచించేలా చెయ్యాలని పౌలు ఈ అలంకారిక ప్రశ్నలను ఉపయోగిస్తున్నాడు. కొంత మంది యూదులు దేవునికి అవిశ్వాసులయ్యారు. కాబట్టి దేవుడు తన వాగ్దానాన్ని పరిపూర్ణం చేయలేదని నిశ్చయించు కున్నారు. (చూడండి: అలంకారిక ప్రశ్నలు).
కానే కాదు
"అది సాధ్యం కాదు" లేక "కచ్చితంగా కాదు." ఇది జరగవచ్చు గాని వెల్లడి అయిన దానిని ఇది గట్టిగా నిరాకరిస్తుంస్తున్నది. మీరు కావాలనుకుంటే, మీ భాషలో దీనికి సంబంధించి ఇలాంటి సరైన భావం ఉంటే ఉపయోగించ వచ్చు.
రాసి ఉన్న ప్రకారం
"యూదుల లేఖనాలు చెబుతున్నదానిని నేను అంగీకరిస్తున్నాను."