te_tn/luk/06/45.md

2.8 KiB
Raw Permalink Blame History

(యేసు ప్రజలకు బోధించడం కొనసాగిస్తూ ఉన్నాడు కానీ తీర్పు తీర్చడం లేదు.)

ఒక రక్షిత స్థలంలో ప్రజలు తమ సంపద దాచుకునే విషయాలతో ఒకని తలంపుల్ని పోల్చే రూపకం. Metaphor, ఈ వచనాలు. యూ డీ బీ లో లాగా పోల్చి చెప్పకుండా వీటిని అనువదించవచ్చు.

మంచి మనిషి

"మంచి వ్యక్తి." "మంచి" అనే మాట నీతికీ లేదా మంచితనానికీ చెందినది. "మనిషి" అనే మాట పురుషుడైనా లేదా స్త్రీ అయినా, ఒక వ్యక్తికి చెందినది. దీనిని ఇలా అనువదించవచ్చు,"ఒక మంచి వ్యక్తి" లేదా "మంచి మనుషులు" (యూ డీ బీ).

తన హృదయమనే ధన నిధి

"తన హృదయంలో దాచుకునే మంచి విషయాలు" లేదా "ఒకడు విలువైనవిగా ఎంచేవి"

బయటకు తెస్తాడు

ఉపమాలంకారం. metaphorలేకుడా దీనిని ఇలా అనువదించవచ్చు,"తన జీవితం, జీవిస్తాడు" లేదా "చేసి చూపిస్తాడు" లేదా "చూపిస్తాడు"

మంచి వాటిని

"మంచి విషయాలను"

హృదయం దేనితో నిండి ఉంటే దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది

"తన హృదయం ఆలోచించేది, తన నోటిలోనుండి వచ్చే మాటల్ని నియంత్రిస్తుంది. " లేదా " తన నోటితో చెప్పేదానిని తన హృదయంలో విలువైనదిగా ఎంచేది నిర్ణయిస్తుంది." నోరు, హృదయం ప్రస్తావన లేకుండా దీనిని ఇలా అనువదించవచ్చు,"ఒకడు చెప్పేది, తాను ఎప్పుడూ ఆలోచించే దానిని చూపిస్తూ ఉంటుంది." లేదా "ఒకడు చెప్పేది తాను ఆలోచించే విషయం మీద ఆధారపడి ఉంటుంది."