2.6 KiB
వారితో పాటు
"ఆయన ఏర్పాటు చేసుకున్న పన్నెండు మందితో" లేదా "తన పన్నెండు మంది అపోస్తలులతో"
తమ రోగాలు బాగు చేసుకోడానికీ
దీనిని నేరుగా ఇలా అనువదించవచ్చు,"యేసు వారిని బాగు చేయడానికి."వాస్తవంగా యేసు వారిని బాగు చేశాడని దీనిని చదివేవారికి స్పష్టం కాకపోతే దీనిని స్పష్టంగా ఇలా చెప్పవచ్చు ," యేసు వారిని బాగు చేశాడు."(చూడండి: క్రియాశీల నిష్క్రియాత్మక. Active passive , స్పష్టమైన, అంతర్గతమైన. Explicit and implicit)
అపవిత్ర ఆత్మలు పట్టి పీడిస్తున్న వారు
" అపవిత్ర ఆత్మలతో బాధింపబడే వాళ్ళు." దీనిని ఇలా కూడా అనువదించవచ్చు,"అపవిత్ర ఆత్మలతో నియంత్రించ బడేవాళ్ళు" లేదా "అపవిత్ర ఆత్మలతో బంధింప బడినవాళ్ళు." యూ డీ బీ కూడా చూడండి.
కూడా బాగయ్యారు
దీనిని ఇలా అనువదించవచ్చు,"యేసు కూడా బాగు చేశాడు."అపవిత్ర ఆత్మలనుండి ప్రజలు బాగు పడుతున్నారని చెప్పడం సహజంగా లేకపోతే, దీనిని "యేసు వారికి విడుదల ఇచ్చాడు" లేదా "వారి నుండి అపవిత్ర ఆత్మలు వదిలి వెళ్ళేలా యేసు చేశాడు."
రోగాలను బాగుచేసే ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి
దీనిని ఇలా అనువదించవచ్చు,"ప్రజలను బాగుచేసే శక్తి ఆయనకుంది." ఆయనలో నుండి ప్రభావం బయటికి వెళ్తూ ఉన్నపుడు, యేసు ఎలాంటి ప్రభావాన్నీ కోల్పోలేదు.