te_tn/luk/05/04.md

2.1 KiB

ఆయన మాట్లాడడం అయిపోయిన తర్వాత

"యేసు ప్రజలకు బోధించడం అయిపోయిన తర్వాత"

స్వామీ

"స్వామీ" గా తర్జుమా చేయబడిన ఈ గ్రీకు పదం, "స్వామీ" అని పిలిచే మామూలు పదం కాదు. అధికారం ఉన్న ఒకని గురించి ఇది చెబుతున్నది గానీ ఒకన్ని సొంతం చేసుకున్న వానిని గురించి కాదు. దీనిని "బాస్" అనిగానీ "ముఖ్యుడైన ఉద్యోగి" అని గానీ అనువదించవచ్చు లేకపోతే అధికారంలో ఉన్న ఎవరినైనా ఎలా పిలుస్తామో అలా, అంటే "సార్" అని కూడా అనువదించవచ్చు.

నీ మాటను బట్టి

"నీ మాట ప్రకారం" లేదా "ఇది చేయమని నీవు చెప్పావు కాబట్టి"

సైగలు చేశారు

వాళ్ళు ఒడ్డుకు చాలా దూరంలో ఉన్నారు, అందుకే పిలవడానికి సైగలు చేశారు. బహుశా చేతులు ఊపి ఉంటారు.

అవి మునిగి పోసాగాయి

"పడవలు మునిగి పోసాగాయి." అర్ధంకావడానికి అవసరమైతే, అస్పష్టంగా ఉన్న విషయాన్నిఇలా స్పష్టం చేయవచ్చు,"చేపలు చాలా బరువుగా ఉన్నాయి కాబట్టి పడవలు మునిగి పోసాగాయి."(చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన. Explicit and implicit )