2.9 KiB
(జెకర్యా తనకు ఇప్పుడే పుట్టిన కొడుకుతో ప్రవచించడం కొనసాగిస్తున్నాడు...)
మహా వాత్సల్యాన్ని బట్టి
దీనిని ఇలా అనువదించవచ్చు,"ఆయన మనపట్ల జాలితో దయతో ఉండడం వలన"
మన దేవుని
ఈ వచనాలన్నిటిలో "మనము", "మనకు" అనే పదాలు యిమిడి ఉండడం గమనించండి. (చూడండి: ఇమిడి ఉండేవి )
ఉదయ కాంతి
"సూర్యోదయం లాగా" లేదా "ఉషోదయం లాగా" (చూడండి: పోలిక)
ప్రసరింప చేశాడు
ఇదొక రూపకం. Metaphor. దీని అర్ధం "ఆయన జ్ఞానమిస్తాడు." దీనిని ఇలా అనువదించవచ్చు,"ఆయన ఆధ్యాత్మిక వెలుగునిస్తాడు"(చూడండి: రూపకం. Metaphor)
చీకటిలో కూర్చున్న వారు
ఇదొక రూపకం. Metaphor. దీని అర్ధం "సత్యం ఎరగని ప్రజలు."
చావు నీడలో (కూర్చున్న వారు)
ఇదొక రూపకం. Metaphor. దీని అర్ధం "చావడానికి సిద్ధంగా ఉన్నవారు" లేదా "తొందరగా చస్తానేమో అని భయపడే వాళ్ళు."
నడిపించేలా
"నడిపిస్తావు" కు ఇది రూపకం. Metaphor.
మన పాదాలను
ఇదొక రకమైన ఉపమాలంకారం. Simile. కేవలం పాదాలకే పరిమితం కాదు గానీ పూర్తి వ్యక్తి కి సంబంధించినది. దీనిని ఇలా అనువదించవచ్చు,"మన"
(చూడండి: అలంకారాలు )
శాంతి మార్గంలో
ఇదొక రూపకం. Metaphor. దీని అర్ధం "శాంతి కరమైన జీవితంలోనికి" లేదా "దేవునితో సమాధాన జీవితం లోనికి." దీనిని ఇలా అనువదించవచ్చు,"సమాధానానికి దారి తీసే మార్గం లో నడిచేలా" లేదా "దేవునితో సమాధానం తెచ్చేలా బతకడం." "మన పాదాలు" నీవెలా అనువదిస్తావో అది, ఈ అనువాదం సరిపోయేలా ఖాయ పర్చుకో.