3.4 KiB
అతని నోరు తెరుచుకుంది ...నాలుక సడలి
ఇవి జాతీయాలు. వాటి అర్ధం, ఇప్పుడు ఆయన మాట్లాడగలుగుతున్నాడు. (చూడండి: జాతీయాలు)
చుట్టుపట్ల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది
దీనిని ఇలా అనువదించవచ్చు, "జెకర్యా, ఎలీసబెతు చుట్టుపక్కల నివసిస్తున్న వారందరూ భయపడ్డారు" లేదా వారి చుట్టూ నివసిస్తున్నవారు దేవుని గురించి ఆశ్చర్యపడ్డారు."ఎందుకంటే దేవుడు శక్తిమంతుడని వాళ్ళు చూశారు. "చుట్టుపక్కల నివసిస్తున్న వారు "అంటే కేవలం పక్కనే ఉంటున్న పొరుగువారే కానక్కరలేదు, కానీ ఆ ప్రాంతంలో నివసించే వారంతా.(చూడండి: జాతీయాలు)
ఆ సమాచారమంతా ....అందరూ చెప్పుకోసాగారు
దీనిని ఇలా అనువదించవచ్చు, "జరిగిన ఈ విషయాలన్నిటినీ గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు"
విన్నవారంతా
"వారు" అనే పదం జరిగిన సంగతులకు సంబంధించినది.
అనుకున్నారు
" ఆశ్చర్యపోయారు"
చెప్పారు
దీనిని ఇలా అనువదించవచ్చు, "ఆశ్చర్యంతో" లేదా "అడుగుతూ"
ఈ బిడ్డ ఎలాటివాడవుతాడో?
దీనిని ఇలా అనువదించవచ్చు, "ఈ బిడ్డ, ఎంత గొప్ప వానిగా ఎదుగుతాడో" లేదా " ఈ బిడ్డ ఎంత గొప్పవాడవుతాడో!" ప్రజల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేఅలంకారిక ప్రశ్న. Rhetorical Question ఇది. ఎందుకంటే శిశువు గురించి వారు విన్నవిషయం, అతడు ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఎదుగుతాడు, అని వారికి అర్ధమయింది.
ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉంది
"ప్రభువు శక్తి అతినితో ఉంది" లేదా "ప్రభువు అతనితో ప్రభావంతో పనిచేస్తున్నాడు."ఇది 'మేటానిమీ'అనే అలంకారానికి ఒక ఉదాహరణ. ఇందులో "ప్రభువు హస్తం" అనే మాట ప్రభువు హస్తానికి సంబంధించినది.(చూడండి: అన్యాపదేశం, Metonymy)