1.7 KiB
1.7 KiB
(మరియ దేవుని స్తుతించడం కొనసాగిస్తున్నది.:)
మరియు
ముందు వచనం ఎలా అనువదించారో అనే దానిని బట్టి కొన్ని భాషల్లో జత కలిపే పదాల్ని వాడరు.
ఆయన కరుణ
దీనిని ఇలా అనువదించవచ్చు, " దేవుని కనికరం" లేదా ఆయన కనికరం ...చూపిస్తాడు" లేదా " ఆయన వారిపట్ల జాలి చూపిస్తాడు."
కలకాలం
దీనిని ఇలా అనువదించవచ్చు, "ప్రతి తరంలోని ప్రజలకు" లేదా "అన్ని తరాల్లోని ప్రజలకు"లేదా "అన్ని కాలాల్లోని ప్రజలకు"
ఆయన పట్ల భయభక్తులు గలవారు
కేవలం భయపడడం కాదు గానీ దీనికి విస్తృత అర్ధం ఏంటంటే, గౌరవించడం, మర్యాద చూపడం, దేవుని మాట వినడం.
తన బాహువుతో
"తన చేతి ద్వారా" ఇది దేవుని శక్తికి సంబంధించిన భాషా ప్రయోగం. (చూడండి:అన్యాపదేశాలు)
చెదరగొట్టివేశాడు
దీనిని ఇలా అనువదించవచ్చు, "పలు దిక్కులకు పరిగేత్తేలా చేశాడు."