2.5 KiB
ఆమె
ఇక్కడ "ఎలీసబెతు" అని వాడడం మరింత స్పష్టంగా, సహజంగా ఉంటుంది. ముందు వచనం నీవు ఎలా అనువదించావో అనే దానిపై ఇది ఆధారపడి ఉంది.
నీ గర్భఫలం
దీనిని ఇలా అనువదించవచ్చు. "నీ గర్భంలోని బిడ్డ" లేదా నీవు పొందే శిశువు" (యు డీ బి ). (చూడండి: రూపకం. Metaphor.)
నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం!
దీనిని ఇలా అనువదించవచ్చు. " నా ప్రభువు తల్లి నా దగ్గరికి రావడం ఎంత అద్భుతం!" ఎలీసబెతు వివరాలు అడగడం లేదు. కానీ ప్రభువు యొక్క తల్లి తన దగ్గరికి వచ్చినందుకు ఎంతో ఆనందాన్నీ ఆశ్చర్యాన్నీ వ్యక్తంచేస్తున్నది. (చూడండి: అలంకారిక ప్రశ్న. Rhetorical Question)
నా ప్రభువు తల్లి
దీనిని ఇలా అనువదించవచ్చు. "నా ప్రభువు తల్లివైన, నీవు". ఎందుకంటే ఇది మరియ గురించినది.
గంతులు వేశాడు
"అకస్మాత్తుగా కదిలాడు" లేదా "బలవంతంగా తిరిగాడు"
నమ్మిన ఆమె ధన్యురాలు
దీనిని ఇలా అనువదించవచ్చు. "నమ్మిన నీవు ధన్యురాలివి" లేదా "నీవు నమ్మావు కాబట్టి నీవు సంతోషిస్తావు."
ప్రభువు ఆమెకు వెల్లడిచేసినది తప్పక జరుగుతుంది
దీనిని ఇలా అనువదించవచ్చు. "ప్రభువు దగ్గరనుండి ఆమెకు వచ్చిన సందేశం" లేదా "ప్రభువు నీకు చెప్పిన విషయాలు."