2.5 KiB
హేరోదు యూదయను పరిపాలించిన
అ కాలంలో హేరోదు యూదయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు.
యూదయ
దీనిని "యూదయ ప్రాంతము" లేదా "యూదా ప్రాంతము" గా అనువదించవచ్చు. కొన్ని భాషలు "యూదయ ప్రాంతంలో జీవించే ప్రజలు " అని వాడుకోవచ్చు.
అనే
"ఒకాయన " లేదా "ఒకాయన ఉండేవాడు." కథలో ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేయడంలో ఇదొక పద్ధతి. మీ భాషలో ఎలా వాడతారో చూడండి.
తరగతి
దీనిని "యాజకుల తరగతి" లేదా "యాజకుల బృందం" గా అనువదించవచ్చు.
అబీయా
"అబీయా నుండి వచ్చిన వారసుడు." ఈ యాజకుల బృందానికి అబీయా పూర్వుడు. వీరంతా ఇశ్రాయేలీయుల మొదటి యాజకుడైన ఆహారోను నుండి వచ్చిన వారసులు.
అతని భార్య
దీనిని "జెకర్యా భార్య" గా అనువదించవచ్చు.
కుమార్తెలలో
"వారసులలో ఆమె కూడా ఒకతె." లేదా "ఆమె కూడా ఆహారోను నుండి వచ్చిన వారసురాలు." దీనిని "జెకర్యా, అతని భార్య ఎలీసబెతు యిద్దరూ ఆహారోను నుండి వచ్చిన వారసులు. " అని కూడా అనువదించవచ్చు.
దేవుని దృష్టికి
"దేవుని దృష్టిలో " లేదా "దేవుని ఉద్దేశంలో."
నడుచుకొనుచు
"విధేయులవుతూ"
సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున
దీనిని "ప్రభువు చెప్పినట్టు, ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం " అని అనువదించవచ్చు.