te_tn/eph/04/01.md

1.4 KiB

ఖైదీనైన నేను

“చెరసాలలో ఉన్న వాడి వలె. ఎందుకంటే ప్రభువును సేవించాలని అతడు నిర్ణయించుకున్నాడు.”

మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా

“మీ పిలుపుకు తగిన ప్రవర్తన చూపమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.” ఈ వచనాల్లో “మీరు” అంటే ఎఫెసు విశ్వాసులు.(నీవు రూపాలు చూడండి)

సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ

“మీరు వినయంగా మృదువుగా సహనంతో ఉండి, ఒకరినొకరు ప్రేమతో స్వీకరించడం నేర్చుకోవాలి.”

సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను

“శాంతిగా సహజీవనం చేసేందుకు చూడండి. ఆత్మ ఐక్యతను అభ్యాసం చెయ్యండి.”