2.4 KiB
2.4 KiB
మీ యజమానులకు లోబడి ఉండండి
విశ్వాసులైన కొలస్సీ బానిసలకు “మీ” అనే పదం వర్తిస్తుంది.
మీరు ఏ పని చేసినా
“మీరు” అనే పదం కొలస్సీ బానిసలకు వర్తిస్తుంది. అయితే కొలస్సీ
క్రైస్తవులందరినీ ఉద్దేసించి చెప్పిన మాట.
మీ ఇహలోక యజమానులకు లోబడి ఉండండి
“మీ యజమానుల మాట వినండి.”
పైకి కనిపించాలని
మీ యజమాని చూస్తున్నప్పుడు మాత్రమే లోబడడం కాదు.
మనుషులను మెప్పించాలని
ప్రభువు కోసం గాక మనుషుల మెప్పు కోసం పని చేసే వారుంటారు. (యు డి బి చూడండి)
చిత్తశుద్ధితో
“హృదయ పూర్వకంగా” (యు డి బి చూడండి)
ప్రభువుకు చేస్తున్నట్లు
“ప్రభువు కోసం.” (యు డి బి చూడండి)
వారసత్వం బహుమతిగా
“ప్రభువు వాగ్దానం చేసిన దానిలో మన భాగం.” (యు డి బి చూడండి)
అక్రమం చేసేవాడికి
ఎలాటి తప్పు అయినా కల్పించుకుని చేసే వాడికి ఇది వర్తిస్తుంది (నైతిక, సాంఘిక, భౌతిక). దీన్ని ఇలా అనువదించ వచ్చు . “తప్పు చేసిన వాడు.” లేక “చెడు జరిగించిన వాడు.”
తగిన శాస్తి
శిక్ష పొందుతాడు.
ఎలాంటి పక్షపాతం ఉండదు
“ప్రత్యేకంగా ఇష్టం చూపడం.” లేక “ఇష్టమైన వాళ్ళు ఉండరు.” లేక “అన్యాయంగా ఇష్టం చూపడం ఉండదు.”