te_tn/act/01/20.md

1.7 KiB

1:16 లో విశ్వాసులకు ఆరంభించిన ప్రసంగాన్ని పేతురు కొనసాగిస్తున్నాడు.

అని కీర్తనల గ్రంథంలో రాసి ఉంది

అప్పుడే జరిగిన యూదాకు జరిగిన దానిని ఆధారం చేసుకుని ఆ పరిస్థితిని సూచిస్తున్నట్టుగా తాను భావించిన కీర్తనల గ్రంథంలోని వాక్యభాగాన్ని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు.

కీర్తనల గ్రంథం

దీనిని "భక్తి గీతాల గ్రంథం"గానూ, లేక "పాటల గ్రంథం"గానూ అనువదించవచ్చు. లేఖనాలలో ఈ గ్రంథం ఒక భాగం.

అతని యిల్లు పాడై పోవు గాక

ఆస్తి శిథిలమైపోవడం, పిచ్చిమొక్కలతో నిండిపోవడం ఆ యజమాని చనిపోయాడని సూచిస్తుంది.

దానిలో ఎవ్వడూ కాపురముండక పోవు గాక

ఆ భూమి నిషిద్ధంగా ఉంది, లేక నివసించడానికి యోగ్యంగా లేదు.

అతని ఉద్యోగం వేరొకడు తీసికొనును గాక’

"అతడు తన నాయకత్వపు స్థానం నుండి తొలగించబడును గాక"