2.4 KiB
2.4 KiB
పౌలు
"పౌలు నుంచి." మీ భాషలో లేఖ రాసే రచయిత ఒక ప్రత్యేక విధానంలో పరిచయం చేసుకోవచ్చు. "పౌలు, అనే నేను, ఈ లేఖ రాసాను" అని రాయవచ్చు. మీరు ఈ లేఖ ఎవరికి రాసారో చెప్పడం అవసరం కావచ్చు. (1:7 చూడండి. యుడిబి).
అపోస్తలుడుగా పిలుపు పొందినవాడు, దేవుని సువార్త కోసం ప్రభువు ప్రత్యేకించుకున్న
దీనిని కర్త ప్రధాన వాక్యంగా "సువార్త గురించి ప్రజలకు చెప్పటానికి దేవుడు నన్ను అపొస్తలుడిగా పిలిచాడు" అని రాయవచ్చు. "(చూడండి: క్రియాశీల, నిష్క్రియాత్మక)
పవిత్ర లేఖనాల్లో తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు
దేవుడు తన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానని తన ప్రజలకు వాగ్దానo చేశాడు. ఆయన తన ప్రవక్తలతో ఈ వాగ్దానాలు లేఖనాల్లో రాయమని చెప్పాడు.
తన కుమారుడు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు గురించిన
ఇది "దేవుని సువార్త" ను సూచిస్తుంది. లోకంలోకి దేవుడు తన కుమారుని పంపడం అనేది సువార్త.
శారీరికంగా చూస్తే దావీదు సంతానం
"శరీరం" ఇక్కడ ఈ వాక్యం భౌతిక శరీరాన్ని సూచిస్తుంది. క్రీస్తు "భౌతిక స్వభావాన్ని బట్టి దావీదు సంతానం" లేక "దావీదు కుటుంబంలో పుట్టినవాడు."