te_tn/eph/04/14.md

2.3 KiB

పసిపిల్లల్లాగా కాక

“అలా ఉంటాము.”

పసిపిల్లల్లాగా కాక

ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేని విశ్వాసిని చాలా స్వల్ప జీవితానుభవం గల పసి బిడ్డ తో ఇక్కడ పోలుస్తున్నాడు. (రూపకం, చూడండి)

అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము

ఈ రూపకం ఇంకా పరిణతి చెందక అబద్ధ బోధలు వినే విశ్వాసిని గాలికి కొట్టుకుపోయే పడవతో పోలుస్తున్నాడు. (రూపకం, చూడండి)

కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని

“మోసగాళ్ళు విశ్వాసులను తెలివైన అబద్ధాలతో బుట్టలో వేసుకుంటారు.”

మాట్లాడుతూ

“దానికి బదులు మనం మాట్లాడుతాము.”

ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా ... అభివృద్ధి చెందుతుంది.

శిరస్సు శరీరం అంతటినీ సమతూకంగా కలిసి పని చేసేలా ఎదిగి ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందేలా చేసినట్టే, క్రీస్తు తన విశ్వాసులంట కలిసి పనిచేసేలా మానవ శరీరం రూపకాన్ని ఉపయోగించి పౌలు చెబుతున్నాడు. (రూపకం, చూడండి)

ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా

“విశ్వాసులు ప్రేమలో ఎదగ డానికి పరస్పరం సహాయం చేసుకునేలా.”