te_tn/col/03/09.md

25 lines
2.6 KiB
Markdown

# దాని పనులతో సహా తీసివేశారు
“మీ” అనే పదం కొలస్సీ విశ్వాసులకు వర్తిస్తుంది.
# మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు.
ఈ అలంకారం మురికి బట్టలు తీసివేసి శుభ్రమైన బట్టలు వేసుకున్న వారివలె భక్తి హీనమైన ప్రవర్తనను తీసి వేసి భక్తి పూర్వకమైన ప్రవర్తన ధరించుకునే క్రైస్తవుణ్ణి వర్ణిస్తున్నది. (రూపకాలంకారం. చూడండి)
# స్వరూపంలోకి
ఇది యేసు క్రీస్తును సూచించే అన్యాపదేశం. (చూడండి, అన్యాపదేశం)
# స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో
యేసు క్రీస్తును అర్థం చేసుకునే పరిజ్ఞానం.
# ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు
దేవుడు ప్రతి వ్యక్తినీ ఒకేలా చూస్తాడు అని ఇది చెబుతున్నది; జాతి, మతం, దేశం, కులం (సాంఘిక హోదా) తో పని లేదు. దీన్ని ఇలా అనువదించ వచ్చు “ఇక్కడ జాతి, మతం, సంస్కృతి సాంఘిక హోదాలతో పని లేదు.”
# క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు.
క్రీస్తు ఉనికికి వేరుగా, బయట ఏమీ లేదు. దీన్ని ఇలా అనువదించ వచ్చు . “క్రీస్తు అన్నిటిలోనూ ప్రాముఖ్యం.”