7:2లో యూదా సభ ముందు స్తెఫను మొదలు పెట్టిన తన జవాబును కొనసాగిస్తున్నాడు. # మెడ వంచనివారూ స్తెఫను తనను యూదు నాయకుల నుండి వేరు చేసుకుని వారిని గద్దిస్తున్నాడు. # హృదయంలో చెవులలో సున్నతి లేని వారు "హృదయంలో అవిధేయులు." స్తెఫను వారిని యూదేతరులతొ సమానం చేస్తున్నాడు. అది తమను దుర్భాషలాడడం అని వారికీ తేలికగానే అర్థం అవుతుంది. # మీ పూర్వీకులు ఏ ప్రవక్తను హింసించకుండా ఉన్నారు? ఇది అలంకారిక ప్రశ్న. ఇక్కడ స్తెఫను వారిని గద్దిస్తున్నాడు. "మీ పూర్వికులు ప్రవక్తలందరినీ హింసించారు" అని తర్జుమా చెయ్యవచ్చు. (చూడండి: అలంకారిక ప్రశ్న) # నీతిమంతుని ఇది మెస్సియ అయిన క్రీస్తును సూచిస్తున్నది. # ఆయనను… హత్య చేసిన వారయ్యారు "నీతిపరుణ్ణి హతమార్చారు." లేక "క్రీస్తు హంతకులు అయ్యారు."