# ఎలానంటే దేవుడు తనను మానవాళికి ఎలా తనను బయలు పరచుకున్నాడో పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు. # అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వస్తువులను తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి కంటికి కనిపించనివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనుషులు తమ కళ్ళతో చూడకపోయినా వాటిని అర్థం చేసుకుంటున్నారు. (రూపకాలంకారం, కర్తరి కర్మణి వాక్యాలు). # లోకం భూమి, ఆకాశం, వాటిలో ఉన్నవన్నీ. # దైవత్వం ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని గుణ లక్షణాలన్నీ” లేక “దేవుణ్ణి దేవుడుగా నిలిపే ఆయన లక్షణాలన్నీ.” # స్పష్టించబడిన వస్తువులను తేటగా పరిశీలించడం ద్వారా ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు చేసిన వాటిని చూడడం ద్వారా మనుషులు దేవుణ్ణి గురించి తెలుసుకోగలరు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు) # వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు ప్రత్యామ్నాయ అనువాదం: “మాకు తెలియదని వారు చెప్పడానికి లేదు.” # వారు 1:18లో చెప్పిన మానవాళి. # తమ ఆలోచనలలో బుద్ధిహీనులయ్యారు బుద్ధిలేని ఆలోచనలు చేయసాగారు. (యు డి బి). # అవివేక హృదయం చీకటిమయం అయింది ‘హృదయం చీకటైపోయి’ అనే మాట అవగాహన లేని వారి గురించి వాడినది. ప్రత్యామ్నాయ అనువాదం: “వారి హృదయం ఇక అర్థం చేసుకునే సామర్థ్యం కోల్పోయింది.” (యు డి బి). (జాతీయాలు చూడండి).