# ( యేసు దయ్యాలను గురించి ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు.) # సాతాను కూడా తనకు తానే వ్యతిరేకంగా వేరైపోతే "సాతాను, అతని రాజ్యంలోని వారు తమలో తాము పోట్లాడు కుంటుంటే." # వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది ఇదొక అలంకారిక ప్రశ్న. దీనిని వాక్యంలాగా ఇలా అనువదించవచ్చు: "సాతాను రాజ్యం నిలవదు," లేదా "సాతాను రాజ్యం పడి పోతుంది." (చూడండి: ఆలంకారిక ప్రశ్న) # నేను బయేల్జేబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని మీరంటుంటే "నేను బయేల్జేబూలు శక్తి తో ప్రజలనుండి దయ్యాలను వెళ్ళగొడుతున్నానని మీరు అంటున్నారు." తన మాటల్లోని తర్వాత భాగాన్ని స్పష్టంగా ఇలా చెప్పవచ్చు,"దాని అర్ధం, సాతాను తనకు తాను వేరై పోయింది." (చూడండి: స్పష్టమైనవి / అస్పష్టమైనవి ) # మీ అనుచరులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొడుతున్నారు "ఎవరి శక్తితో మీ అనుచరులు ప్రజల నుండి దయ్యాలను వెళ్ళగొడుతున్నారు." ఇదొక అలంకారిక ప్రశ్న. దీనిని ఇలా అనువదించవచ్చు: " మీ అనుచరులు కూడా దయ్యాలను బయేల్జేబూలు శక్తి తో వెళ్ళగొడుతున్నారు అని మనం అంగీకరించాలి." ఈ వాక్యాన్ని స్పష్టంగా ఇలా స్పష్టంగా చెప్పవచ్చు: "అది వాస్తవం కాదని మనకు తెలుసు." # వాళ్ళు మీకు తీర్పు తీరుస్తారు "నేను బయేల్జేబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని చెప్పినందుకు, దేవుని శక్తితో దయ్యాలను వెళ్ళగొడుతున్న మీ అనుచరులు మీకు తీర్పు తీరుస్తారు." # దేవుని వేలితో "దేవుని వేలు" అనేది దేవుని శక్తికి సంబంధించినది. (చూడండి: అన్యాప దేశాలు) # దేవుని రాజ్యం కచ్చితంగా మీ దగ్గరకు వచ్చింది " దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చిందని తెలుస్తుంది"